ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలి: జనార్దన్ రావు

by S Gopi |

పదవ తరగతి విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని... Education officer visits School

ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలి: జనార్దన్ రావు
X

దిశ, గన్నేరువరం: పదవ తరగతి విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్య అధికారి సీహెచ్ జనార్దన్ రావు ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం జంగపల్లి జెడ్పీ హెచ్ఎస్ పాఠశాలను ఆయన సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధులవుతున్నారో వారిని పాఠ్యాంశాల నుండి కొన్ని ప్రశ్నలు అడిగి పరీక్షించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న స్నాక్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షలలో పది జీపీఏ సాధించేలా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. వారి వెంట సెక్టోరియల్ ఆఫీసర్ కర్ర అశోక్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.

Next Story