- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముందస్తు జాగ్రత్త.. ఊటూరులో తాగునీటి కష్టాలకు చెక్
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రామస్థులకు తాగునీటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామ పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు.

దిశ, మానకొండూరు : రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రామస్థులకు తాగునీటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామ పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. మానేరు వాగులోని మంచి నీటి బావిలో సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన విద్యుత్ మోటార్‌ను ఆదివారం సిబ్బంది సహాయంతో బయటకు తీసి మరమ్మతులు చేయించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా.. గతంలో లోయర్ మానేరు డ్యాం (LMD) గేట్లు ఎత్తినప్పుడు వాగులో వరద తాకిడికి విద్యుత్ స్తంభాలు, తీగలు దెబ్బతినడంతో గ్రామంలో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగేది. ఈ సమస్యను గుర్తించిన అధికారులు, ఈసారి వేసవి రాకముందే అప్రమత్తమై పాడైన మోటార్లను బాగు చేయించారు. నీటి సరఫరాలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వరదలు వచ్చినప్పుడు విద్యుత్ లైన్లు దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై దృష్టి సారించారు. ప్రజల దాహార్తిని తీర్చడంలో అధికారులు చూపిస్తున్న చొరవపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "నీటి కష్టాలు రాకముందే అధికారులు స్పందించి, స్వయంగా దగ్గరుండి మోటార్ బాగు చేయించడం అభినందనీయం" అని గ్రామస్థులు కొనియాడుతున్నారు. అధికారుల ఈ ముందుచూపుతో ఈ వేసవిలో ఊటూరులో తాగునీటి ఎద్దడి ఉండదని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.





