- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైవర్లకు కంటి చూపు స్పష్టంగా ఉండాలి : పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి చూపు స్పష్టంగా ఉండటం అత్యంత కీలకమని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద రోడ్డు ప్రమాదాలకు దారితీసే అవకాశముందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం డ్రైవర్లకు సూచించారు.

దిశ, గంగాధర : వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి చూపు స్పష్టంగా ఉండటం అత్యంత కీలకమని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద రోడ్డు ప్రమాదాలకు దారితీసే అవకాశముందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం డ్రైవర్లకు సూచించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో దశ “అర్రైవ్ అలైవ్” రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా గంగాధర మండలం మధురానగర్ గ్రామంలోని విఎఎస్ గార్డెన్స్ వద్ద లయన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రారంభించారు.
ఆటో, లారీ, కారు వంటి వాహనాల డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో స్పష్టమైన కంటి చూపు అత్యంత ముఖ్యమని వైద్యులు, పోలీసులు డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. డ్రైవర్లు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ప్రయాణికుల భద్రతను కూడా కాపాడవచ్చని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ శిబిరం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, రజిని, మండల ఎంపీడీవో దమ్మని రాము, మండల తహశీల్దార్ అంబటి రజిత, సర్కిల్ ఎస్సైలు వంశీకృష్ణ, రాజు, నరేష్ రెడ్డి, గ్రామ సర్పంచ్‌లు, వాహన డ్రైవర్లు పాల్గొన్నారు.






