రామగుండం కార్పొరేషన్‌లో భార్యా, భర్తల డబుల్ విక్టరీ

by Ratna Kumari |

రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భార్య‌, భ‌ర్త డ‌బుల్ విక్ట‌రీ సాధించారు.

రామగుండం కార్పొరేషన్‌లో భార్యా, భర్తల డబుల్ విక్టరీ
X

దిశ, గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు వేర్వేరు డివిజన్లలో విజయం సాధించడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 58వ డివిజన్ నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మేకల సమ్మయ్య యాదవ్ ఘన విజయం సాధించారు. 60వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన మేకల శారద కూడా ప్రజల విశ్వాసాన్ని అందుకొని గెలుపొందారు. ఇద్దరూ తమ తమ డివిజన్లలో విస్తృత ప్రచారం నిర్వహించి, స్థానిక సమస్యల పరిష్కారంపై హామీలు ఇచ్చి ఓటర్ల మద్దతు పొందినట్లు తెలిసింది. కుటుంబంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి కార్పొరేషన్‌లో అడుగుపెట్టడం ఆచార్యాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కార్పొరేటర్లుగా ఎన్నిక కావడంతో వారి కుటుంబ సభ్యులు, అనుచరులు సంబరాలు నిర్వహించారు. ఇకపై రెండు డివిజన్ల అభివృద్ధికి సమన్వయంతో పని చేస్తామని విజేతలు పేర్కొన్నారు. ఈ డబుల్ విక్టరీ రామగుండం రాజకీయాల్లో ప్రత్యేకత చాటుకుంది.

Next Story