- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ వాడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు : ప్రిన్సిపాల్ విజయలక్ష్మీ
విద్యార్థులు డ్రగ్స్ వాడటం వల్ల శారీరకంగా, మానసికంగా కృంగిపోయి.. తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటారని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ తెలిపారు.

దిశ, గంభీరావుపేట : విద్యార్థులు డ్రగ్స్ వాడటం వల్ల శారీరకంగా, మానసికంగా కృంగిపోయి.. తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటారని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి అధ్యక్షతన మాదక ద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి మాదక ద్రవ్యాల వైపు పోకుండా చదువు పై శ్రద్ధ వహించి ఉన్నతమైన జీవితాన్ని స్థిరపరచుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని హితవుపలికారు. గంభీరావు పేట మండల రెవెన్యూ ఆఫీసర్ మారుతి రెడ్డి, ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్, "మా",స్వచ్చంద సంస్థ చైర్మన్ మల్లు నర్సాగౌడ్ డ్రగ్స్ నిర్మూలనపై పోస్టర్ ప్రజెంటేషన్ చేశారు. 1. డ్రగ్స్ Yes అంటే జీవితానికి No అన్నట్టే. 2. డ్రగ్స్ వద్దు డ్రీమ్స్ ముద్దు.3. డ్రగ్స్ కు దూరంగా ఉండు. జీవితానికి దగ్గరగా ఉండు. అంటూ ప్రిన్సిపాల్ గారు పిల్లలు చేత నినాదమందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎం. ప్రభాకర్, ఐక్యు ఏసీ కోఆర్డినేటర్ వై. ఆంజనేయులు, టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ జె శ్రావణ్ కుమార్, స్కాలర్షిప్ కోఆర్డినేటర్ డాక్టర్. ఎన్. ఆదివిష్ణు, డాక్టర్ కె.వి. బిక్షమయ్య, శ్రీనివాస్, కృష్ణ ప్రసాద్, మహేష్, దీపికా, భార్గవి అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.






