అధైర్యపడొద్దు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..

by Elthuri vijay kumar |

-ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

అధైర్యపడొద్దు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..
X

అధైర్యపడొద్దు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..

-ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

-భారీ వర్షాలతో అతలాకుతలమైన హుజురాబాద్ నియోజకవర్గం

దిశ,హుజురాబాద్ రూరల్ : గురువారం రాత్రి హుజురాబాద్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు పర్యటించారు. రెడ్డి కాలనీ, బుడగజంగాల కాలనీ, మామిండ్లవాడ, గాంధీనగర్లలో పర్యటించి, స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడారు. హుజురాబాద్‌కి సమీపంలో ఉన్న గుండ్ల చెరువులో నీటి మట్టాన్ని పరిశీలించారు. వర్షం వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు అధైర్యపడవద్దని, తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో కూడా వర్షాలు పడితే ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడుతున్న బాధితులకు నిత్యావసర వస్తువులను అందించారు. బాధితులను ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. పర్యటనలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, ఇతర అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story