మభ్యపెట్టి ఓటు అడగకండి.. వినూత్న ప్రచారంతో ఓటర్

by Nallavelli.Anjaneyulu |

దిశ, రామడుగు : భారతదేశంలో ఓటు హక్కు స్వేచ్ఛ స్వతంత్రం కలిగినటువంటి విలువైన ఓటును మద్యంతో డబ్బుతో మభ్య పెట్టేందుకు దయచేసి అభ్యర్థులు నా ఇంటికి రాకండి. మీ అభ్యర్థిత్వానికి

మభ్యపెట్టి ఓటు అడగకండి.. వినూత్న ప్రచారంతో ఓటర్
X

దిశ, రామడుగు : భారతదేశంలో ఓటు హక్కు స్వేచ్ఛ స్వతంత్రం కలిగినటువంటి విలువైన ఓటును మద్యంతో డబ్బుతో మభ్య పెట్టేందుకు దయచేసి అభ్యర్థులు నా ఇంటికి రాకండి. మీ అభ్యర్థిత్వానికి కేవలం గుర్తు చెప్పి ఓటు అడిగి వెళ్ళండి తప్ప ఇతరత్రా విషయాలు ఏది కూడా మా దరికి చేరనివ్వకండి. ఓటు హక్కును స్వేచ్ఛగా వాడుకునేందుకు మాకు అవకాశం కల్పించాలి తప్ప ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దు అంటూ మా ఇంటి ఓటర్లు ఇలాంటి డబ్బు తీసుకోబడదు అంటూ ఓ వినూత్నమైన ప్రచారంతో తన ఇంటి గోడకు రాతపూర్వకంగా అంటి పెట్టి ప్రజలను మేలుకొలుపుతున్న ఓ వ్యక్తి. రామడుగు మండల కేంద్రానికి చెందిన జవాజి మల్లయ్య అనే వ్యక్తి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. నా ఇంటికి వస్తే ఓటును అభ్యర్థించండి తప్ప ఎలాంటి మద్యం డబ్బులకు ప్రలోభ పెట్టకుండా ఏది కూడా మేము తీసుకోమంటూ స్వచ్ఛందంగా మా ఓటును స్వేచ్ఛగా నచ్చిన వారికే వేసుకుంటామని రాతపూర్వకంగా తన ఇంటి గోడకు అంటించడం అందరి ఆశ్చర్యపరిచింది.

Next Story