- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడికల్ కాలేజీకి వృద్ధురాలి పార్థివ దేహం దానం
అనారోగ్యంతో మృతి చెందిన వృద్దురాలి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు కరీంనగర్ లోని మెడికల్ కళాశాలకు దానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, మంచాల కృష్ణ సమక్షంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మెడికల్ కళాశాలకు అప్పగించారు.

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్‌కు చెందిన అర్వపెల్లి అమృతాభాయి (100) వయోభారం, అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం కరీంనగర్ లోని మెడికల్ కాలేజీకి దానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, మంచాల కృష్ణ సమక్షంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ మానవ శరీర దానం వైద్య విద్యాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వైద్య విద్యార్థులు శరీర నిర్మాణ శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి మృతదేహాలు ఎంతో అవసరమని అన్నారు. అలాగే కొత్త వైద్య పరికరాలు, శస్త్ర చికిత్స పద్ధతుల అభివృద్ధికి కూడా ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు రాచకొండ నరేందర్, జిడిగే పురుషోత్తం, రేగొండ రాజేంద్ర ప్రసాద్ నాయకులు సమైండ్ల శ్రీనివాస్, చకినం కిషన్, పులి శ్రీధర్, బొడ్ల జగదీష్ పాల్గొన్నారు.






