- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు : బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఆయన బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమి, తాగునీటి సమస్యలు, మరుగుదొడ్ల కొరత, తరగతి గదుల సమస్యలు విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో విద్యారంగ అభివృద్ధిపై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఎంత దూరమైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు, మట్టేశ్రీనివాస్, అరెల్లి వినయ్, సదుల శేఖర్, అనుముల శివ, శశి రాజు పాల్గొన్నారు.






