వ‌రికొయ్య‌లు మొక్క‌జొన్న అవ‌శేషాల‌ను కాల్చొద్దు

by Ratna Kumari |

వెల్గటూర్ ఎండపల్లి మండల పరిధిలో గల రైతులకు ఎస్సై పి.ఉదయ్ కుమార్, వరి మొక్కజొన్న పంటల వృధాలను కాల్చివేయటం పట్ల పలు సూచనలు చేశారు.

వ‌రికొయ్య‌లు మొక్క‌జొన్న అవ‌శేషాల‌ను కాల్చొద్దు
X
దిశ‌, వెల్గ‌టూర్ : వెల్గటూర్ ఎండపల్లి మండల పరిధిలో గల రైతులకు ఎస్సై పి.ఉదయ్ కుమార్, వరి మొక్కజొన్న పంటల వృధాలను కాల్చివేయటం పట్ల పలు సూచనలు చేశారు. వరి కోతల అనంతరం పొలాల్లో మిగిలిన వరి కొయ్యలను మొక్కజొన్న అవశేషాలను కాల్చివేయవద్దని హెచ్చరించారు. వరి కొయ్యలను మొక్కజొన్న అవశేషాలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు రహదారులపై పొగకమ్ముకొని ఏర్పడి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వ్యవసాయ భూముల్లోని సూక్ష్మ జీవులు నశించి భూమిలోని సారవంతం తగ్గిపోతుందని పేర్కొన్నారు, వరి కొయ్యలను కాల్చడం వలన సమీపంలోని డ్రిప్ పైపులు, విద్యుత్ మోటార్లు ఇతర వ్యవసాయ పరికరాలు అగ్నికి ఆహుతై సహచర రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతులు పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా వరి అవశేషాలను కాల్చకుండా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఎవరైనా వరి కొయ్యలను కాల్చినట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు కూడా విధించబడతాయని ఎస్సై ఉదయ్ కుమార్ హెచ్చరించారు.
Next Story