సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

by velandi.Saikiran |

డాక్టర్ శ్రీరామ్ సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, సైదాపూర్: కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. రాబోవు సీజన్ వ్యాధుల దృష్ట్యా సమయపాలన పాటించాలని, పాము, తేలు కాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం అవుట్ పేషంట్ విభాగం, ప్రయోగశాల, ప్రసవ గదిని పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉండటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్, డిడిఓ డాక్టర్ గొట్టే శ్రవణ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ కృష్ణ కుమార్, ఓపీ డాక్టర్ కృష్ణారావు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉన్నారు.

Next Story