- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుర్కపల్లి గ్రామంలో అనధికార "లేఅవుట్ " పై వివాదం
ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 169లో అనధికార లేఅవుట్ ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

దిశ, ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 169లో అనధికార లేఅవుట్ ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ లేఅవుట్‌పై ఎలాంటి కొనుగోలు, అమ్మకాలు చేయకూడదని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసినప్పటికీ, సంబంధిత లేఅవుట్ స్థలంలో మాత్రం ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేదా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లేఅవుట్ స్థలంలో హెచ్చరికలు లేకపోవడంతో అమాయక ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామ పంచాయతీ అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పంచాయతీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీ పెట్టడం మాత్రమే సరిపోదు. ప్రజలు ఎక్కువగా వెళ్లే లేఅవుట్ ప్రదేశంలో స్పష్టమైన హెచ్చరికలు ఏర్పాటు చేయాలి” అని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు. అనధికార లేఅవుట్ల వల్ల భవిష్యత్తులో భూములపై చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో, వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని లేఅవుట్ స్థలంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అనధికార లేఅవుట్‌పై చర్యలు వేగవంతం
169 సర్వే నెంబర్లలో అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్‌పై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ లేఅవుట్‌లో స్థలాల కొనుగోలు, అమ్మకాలు జరిపిన వారు శిక్షార్హులని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి సంబంధిత స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. సంబంధిత లేఔట్‌పై వివాదాలు, అనుమతుల అంశాలు పరిశీలనలో ఉన్నందున తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరూ కొనుగోలు, అమ్మకాలు చేయకూడదని MRO సూచించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని అప్రమత్తం చేస్తూ, నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.






