- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్ : ఆసుపత్రిలో గర్భిణిని అడ్మిట్ చేసిన వైద్యులు...
by Bhanu |
ప్రసవ వేదన.. నరకయాతన.. ప్రసవం కోసం వస్తే తిప్పి పంపిండ్రు.. అంటూ 'దిశ' పత్రికలో వచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పందించారు.

X
దిశ, హుజురాబాద్ రూరల్ : ప్రసవ వేదన.. నరకయాతన.. ప్రసవం కోసం వస్తే తిప్పి పంపిండ్రు.. అంటూ 'దిశ' పత్రికలో వచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పందించారు. ప్రసవం కోసం వచ్చిన సైదాపూర్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన గర్భిణి మహిళ రమ్యను హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకు వచ్చి గైనకాలజిస్ట్ చేత పరీక్షలు జరిపి గర్భిణీకి ,శిశువుకు ప్రాణాపాయం లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిసింది.
దీంతో ఉదయం హుజరాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించే వైద్యురాలు డాక్టర్ వాణి లతచే పరీక్షించి అడ్మిట్ చేశారు. అబ్జర్వేషన్ అనంతరం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సిజేరియన్ చేశారు. రమ్య మగ శిశువుకు జన్మనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story






