Disha effect : దిశ ఎఫెక్ట్​...సొసైటీ సీఈఓ సస్పెన్షన్​

by Sridhar Babu |   (  Updated:2024-08-06 11:04:09  IST  )

దిశ కథనానికి స్పందన లభించింది.

Disha effect : దిశ ఎఫెక్ట్​...సొసైటీ సీఈఓ సస్పెన్షన్​
X

దిశ, చందుర్తి : దిశ కథనానికి స్పందన లభించింది. చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ఫ్యాక్స్) లో జరిగిన అవకతవకలపై అధికారులు స్పందించారు. శనివారం అక్రమాలకు అడ్డాగా చందుర్తి ప్యాక్స్ అనే కథనం దిశ పత్రికలో ప్రచురితమైంది. కాగా జిల్లా అధికారులు వెంటనే స్పందించారు. గంగారెడ్డి సంఘ కార్యదర్శి 32 లక్షల రూపాయలు రైతుల

నుండి వసూలు చేసి సంఘంకు జమ చేయకుండా అక్రమాలకు పాల్పడినారని ప్రాథమిక విచారణ లో తేల్చారు. ఈ విషయంపై సంఘ కార్యదర్శిని విధుల నుండి సస్పెండ్ చేశారు. ఈ సహకార సంఘం సొసైటీలో అవకతవకల విషయంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఇందులో ఉన్నదనే కోణంలో పూర్తి విచారణ జరుపుతామని జిల్లా సహకార అధికారి బుద్ధ నాయుడు తెలిపారు.

Next Story