- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్ : హుజురాబాద్ సమీపంలో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళన..
హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామ సమీపంలోని గుట్టలలో చెత్త ఆధారిత విద్యుత్ ప్లాంట్ (ఎనర్జీ ప్లాంట్) ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచనపై స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామ సమీపంలోని గుట్టలలో చెత్త ఆధారిత విద్యుత్ ప్లాంట్ (ఎనర్జీ ప్లాంట్) ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచనపై స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. 'దిశ' దినపత్రికలో గత వారం రోజుల క్రితం "కాలుష్య కోరల్లో హుజురాబాద్ " సిరిసపల్లి సమీపంలో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు.. అనే శీర్షిక ప్రచురితమైంది. దీనికి స్పందించిన సమీప గ్రామాల ప్రజలు స్థానిక ఆర్డిఓ, తాహసిల్దార్ కు ప్లాంట్ ఏర్పాటు చేయకూడదని ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రైవేటు సహకారంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ వల్ల హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 10 గ్రామాల ప్రజలు పలు రకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని, తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజూ వెయ్యి టన్నుల చెత్తను రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల నుండి లారీల ద్వారా హుజురాబాద్‌కు తరలించడం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
డంపింగ్ యార్డు, ప్లాంట్ ఏర్పాటు వల్ల శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, ఆస్తమా, క్యాన్సర్లు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, భూసారం, భూగర్భ జలాలు దెబ్బతింటాయని, వ్యవసాయం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి బూడిద లారీల ద్వారా రవాణా అవుతున్న నేపథ్యంలో, డంపింగ్ యార్డ్ తోడైతే తాము మరింత నష్టపోతారని వారు వాపోయారు.
హుజురాబాద్‌లో భారీ ప్లాంట్ ఏర్పాటుకు బదులుగా, ఆయా ప్రాంతాల్లోనే మినీ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుందని, రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని, ప్రజలు నష్టపోకుండా ఉంటారని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి, హుజురాబాద్ ప్రాంతంలో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, సిరిసపల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు బింగి కరుణాకర్, విజయ్ కుమార్, ఎల్లయ్య ఆయా పార్టీల నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






