Disha Effect : దిశ ఎఫెక్ట్.. స్టోన్ క్రషర్‌పై అధికారుల కొరడా..!

by Chintha Aamani |

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలోని

Disha Effect : దిశ ఎఫెక్ట్.. స్టోన్ క్రషర్‌పై అధికారుల కొరడా..!
X

దిశ,కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలోని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్టోన్ క్రషర్ పై అధికారులు కొరడా జులిపించారు.గ్రామంలోని సర్వే నెంబరు 116 లో గల 'ప్రభుత్వ భూమిలో స్టోన్ క్రషర్' అనే శీర్షికతో ఈ నెల 17న దిశ పత్రికలో కథనం ప్రచురించింది. స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. జన నివాసాల మధ్య పొల్యూషన్ వెదజల్లుతూ..నడుస్తున్న స్టోన్ క్రషర్ ని పర్మినెంట్ గా మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story