ఉప సర్పంచ్ పదవికి గండం...?

by Muthe.Rajitha |

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో సర్పంచ్ ఎన్నికలు మొదటి దశలో ముగిసింది.

ఉప సర్పంచ్ పదవికి గండం...?
X

దిశ, మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో సర్పంచ్ ఎన్నికలు మొదటి దశలో ముగిసింది. మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో అధికారులు ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థులు తమ అదృష్టాలను ఓటర్లపై భారం వేసి బరిలో దిగారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం గెలిచినవారు ఆనందంతో ఉంటే ఓడినవారు ఓటమికి గల కారణాలు వెతికే అంచనాలలో మునిగిపోయారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్, ఉప సర్పంచ్ లకు కలిపి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంతో ఉపసర్పంచ్ పదవికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. కౌంటింగ్ జరిగే సమయంలో అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకు తప్ప లోపలికి ఇతరులకు ప్రవేశం లేకపోవడంతో కొన్ని గ్రామాలలో ఉప సర్పంచ్ పదవి తారు మారు అయింది.

అత్యధిక రేటు పలికిన ఉప సర్పంచ్ పదవి...?

సర్పంచ్ ఉప సర్పంచ్ కి జాయింట్ చెక్ పవర్ ఉండడంతో కొందరు నాయకులు కౌంటింగ్ హాలులో చక్రం తిప్పి ఉప సర్పంచ్ పదవి కైవసం చేసుకోవడంలో తమదైన శైలిలో ముందుకు వెళ్లారు. మండలంలోని ఓ గ్రామంలో పది మంది వార్డు మెంబర్లు ఉండగా ఆరుగురి తో ఉప సర్పంచ్ పదవి కైవసం చేసుకోవచ్చు.అక్కడ మిగితా ఐదుగురు వార్డు మెంబర్లు కు ఒక్కొక్కరికి రూ 2 లక్షల 20 వేలు లకు ఒప్పందం జరిగింది. అలా ఓటింగ్ లో పాల్గొన్న వార్డు నెంబర్లు సర్పంచ్ అభ్యర్థి ముందు నుంచి ఉపసర్పంచ్ ను ప్రకటించిన వారికి మద్దతు తెలుపకుండా ఎవరైతే తాయిలాలు ఎరజూపారో వాళ్లకి మద్దతు తెలిపారు. దీంతో ఉప సర్పంచ్ పదవి ఆ మహిళకు వరించింది. ఇంతవరకు బాగానే ఉన్నా బయటకు వచ్చిన తర్వాత ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ విషయం గ్రామంలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అసలు చట్టం ఏం చెబుతోంది

గత ప్రభుత్వ పంచాయతీరాజ్ చట్టం ఉపసర్పంచ్​గా ఒకరిని ఎన్నుకున్న తర్వాత దాదాపుగా రెండున్నర సంవత్సరాల వరకు అవిశ్వాసం పెట్టడానికి వీలుండదు. దీంతో వార్డు నెంబర్లు తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా కౌంటింగ్ హాల్లోకి ఇతరులకు ప్రవేశం లేకపోవడంతో అందులో గెలిచిన వార్డు నెంబర్లు కీలకంగా మారారు. ప్రమాణ స్వీకారం రోజున ఆ వార్డు నెంబర్లు ఎలా వ్యవహరిస్తారో అనేది మండల వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.మరో గ్రామం లో అనుకున్న వారికి ఉప సర్పంచ్ పదవి దక్కకుండా మరో వ్యక్తి కి దక్కడం తో గ్రామ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

Next Story