మంత్రి గంగుల ఇంటి ముందు ఆశా కార్యకర్తల ధర్నా..

by Disha Web Desk 23 |
మంత్రి గంగుల ఇంటి ముందు ఆశా కార్యకర్తల ధర్నా..
X

దిశ,కరీంనగర్: కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఆశా వర్కర్లు ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. తమను రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంత్రి ఇంటి ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా ఆశా వర్కర్లు సమ్మె చేస్తున్నారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇంట్లో ఉన్న సమయంలోనే ఆశా వర్కర్ల ఆందోళనకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆశా వర్క్‌ర్ల ఆందోళనను అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Next Story