భార్యను బస్సు ఎక్కించే ప్రయత్నంలో భర్త మృతి

by Bhanu |

తన భార్యను సమయానికి బస్సెక్కించి కళాశాలకు అందించాలనే తాపత్రయంతో వేగంగా బండిపై వెల్తూ ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టి భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలైన ఉదంతం ధర్మపురిలో బుధవారం చోటు చేసుకొంది.

భార్యను బస్సు ఎక్కించే ప్రయత్నంలో భర్త మృతి
X

దిశ, వెల్గటూర్ : తన భార్యను సమయానికి బస్సెక్కించి కళాశాలకు అందించాలనే తాపత్రయంతో వేగంగా బండిపై వెల్తూ ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టి భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలైన ఉదంతం ధర్మపురిలో బుధవారం చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం ధర్మపురి పట్టణానికి చెందిన ఒడ్నాల భూమేష్ (40) అనే అధ్యాపకులు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. భూమేష్ తన భార్యను ట్రెయినిగ్ కోసం కరీంనగర్ వెళ్ళడానికి నిత్యం బస్టాండ్ లో బస్సు ఎక్కిస్తారు. యధావిధిగా భార్యని బండి ఎక్కించుకొని బస్టాండ్ కి వస్తున్నారు.


అప్పటికే కరీంనగర్ వెళ్లే బస్సు బస్టాండ్ నుండి కదిలి వెళ్లింది.ఇది గమనించిన భూమేష్ ముందు వెళ్తున్న బస్సును అందుకోవడానికి తన బండి స్పీడ్ పెంచగా అదే సమయంలో ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనంతో ఎదురెదురుగా దీకొట్టుకున్నారు.ఈ ఘటనలో భూమేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయమై రక్త స్రావం కాగా హుటా హుటిన జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందు తోంది. మృతుడు ధర్మారం మండల కేంద్రం లోని ఓ కళాశాలలో ప్రయివేటు అధ్యాపకులుగా పని చేస్తున్నట్లు సమాచారం. కాగా బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నామని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.

Next Story