దేశంలో ఐటి విప్లవానికి నాంది పలికిన నాయకుడు రాజీవ్

by velandi.Saikiran |

ప్రధానమంత్రిగా దేశంలో ఐటి విప్లవానికి నాంది పలికిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ అన్నారు.

దేశంలో ఐటి విప్లవానికి నాంది పలికిన నాయకుడు రాజీవ్
X

దిశ, ధర్మపురి: ప్రధానమంత్రిగా దేశంలో ఐటి విప్లవానికి నాంది పలికిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని నంది చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయి రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు.

భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది తెర తీశారని ఆయన చేసిన సేవలను కొనియాడారు.. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి భారత్‌ను చేర్చిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ. దేశంలో మతసామరస్యం కోసం సద్భావన యాత్ర చేపట్టారు. కంప్యూటర్ రంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చిన ఫలితంగా నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఐటీ రంగంలో చక్రం తిప్ప గలుగు తున్నారని గర్వంగా చెప్పారు . అంతర్జాతీయ విమానాశ్రయాల రూపకల్పన, 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు, గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు చేరే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారని గుర్తు చేసు కున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘన బట్ల దినేష్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story