విద్యుత్ ఘాతంతో అపార నష్టం.. 40 గొర్రెల మృతి 35 గొర్రెల అస్వస్థత

by Bhanu |

విద్యుత్ ఘాతంతో గొర్రెలు మృత్యువాత పడ్డ సంఘటన మండలంలోని చామనపల్లి గ్రామంలో జరిగింది.

విద్యుత్ ఘాతంతో అపార నష్టం.. 40 గొర్రెల మృతి 35 గొర్రెల అస్వస్థత
X

దిశ, ధర్మారం: విద్యుత్ ఘాతంతో గొర్రెలు మృత్యువాత పడ్డ సంఘటన మండలంలోని చామనపల్లి గ్రామంలో జరిగింది. చామనపల్లి గ్రామంలోని దాడి ఓదయ్య, దాడి ఐలయ్య, ఓరుగల మల్లయ్య, ఆవుల భూమయ్యల గొర్రెలు రోజు వారిగా మేతకు తీసుకెళ్లారు. అయితే.. ఈ క్రమంలోనే నీరు తాగడానికి వాగులోకి వెళ్లిన గొర్రెలు విద్యుత్ ఘాతంతో మృతి చెందడంతో బాధితులు వారి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

గొర్ల కాపర్ల వృత్తితో జీవనం కొనసాగిస్తున్న వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ సంఘటనలో 40 గొర్రెల మృతి చెందగా 35 గొర్రెల అస్వస్థతకు గురయ్యాయి. వాగు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఉన్న విద్యుత్ వైరు వాగులో పడటంతో ప్రమాదం జరిగింది అని స్థానికులు చెబుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story