అంజన్న గుడికి వెళ్లాలంటే భక్తులకు కష్టాలు

by Elthuri vijay kumar |

బ్రిడ్జి నిర్మాణం చేయాలని గ్రామ ప్రజలు భక్తుల వేడుకోలు.

అంజన్న గుడికి వెళ్లాలంటే భక్తులకు కష్టాలు
X

అంజన్న గుడికి వెళ్లాలంటే భక్తులకు కష్టాలు

- బ్రిడ్జి నిర్మాణం చేయాలని గ్రామ ప్రజలు భక్తుల వేడుకోలు.

దిశ,గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో అద్దంల మెరిసే బండలు చుట్టూ గుట్టలు, పచ్చని పొలాలు, పారే జలపాతం, ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రాంతం అంత ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. శ్రీ వీరాంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. అయితే గత పది రోజుల క్రితం కురిసిన వర్షానికి గుడికి వెళ్లడానికి నామమాత్రము బ్రిడ్జి ఉండేది, మొన్నటి వరదకు బ్రిడ్జి మొత్తం తెగిపోయి, గుడికి పోయేందుకు వీలు లేకుండా ఏర్పడింది. అధికారులు స్పందించి గుడికి వెళ్లడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Next Story