అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలి : క‌లెక్ట‌ర్ కోయ శ్రీ హ‌ర్ష

by Ratna Kumari |

మంథని ముత్తారం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు సమయానికి నాణ్యతతో పూర్తి కావాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలి : క‌లెక్ట‌ర్ కోయ శ్రీ హ‌ర్ష
X

దిశ, మంథని : మంథని ముత్తారం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు సమయానికి నాణ్యతతో పూర్తి కావాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముత్తారం మండలంలోని దర్యాపూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో కోటి రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను, మంథని పట్టణం లోని అయ్యగారి చెరువు రీ మోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిల్లాలో అభివృద్ధి పనులు సమయానికి,నాణ్యతతో పూర్తి కావాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ముత్తారం మండలంలోని దర్యాపూర్ మోడల్ స్కూల్‌ లో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1 కోటి నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను క‌లెక్ట‌ర్ పరిశీలించారు.

పనుల పురోగతి పై సమగ్రంగా ఆరా తీసి, ఇప్పటికే ఆమోదించిన పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు పనుల కోసం మరిన్ని నిధులు అవసరమైతే వెంటనే అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని, అంచనాలు అందిన వెంటనే అవసరమైన అదనపు నిధులను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం మంథని మున్సిపాలిటీ పరిధిలోని అయ్యగారి చెరువు రీ-మోడలింగ్ పనులను పరిశీలించారు. చెరువు పునర్నిర్మాణ పనులను వచ్చే సోమవారం నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రతిపాదిత పనుల్లో కనీసం 50 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు వేగవంతంగా, నాణ్యతతో కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story