గత ప్రభుత్వాలను తలదన్నేలా అభివృద్ధి చేపట్టాలి

by Ratna Kumari |

గత ప్రభుత్వాల తలాదన్నేలా కరీంనగర్ నగరపాలక సంస్థ ను అభివృద్ధి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ కోరారు.

గత ప్రభుత్వాలను తలదన్నేలా అభివృద్ధి చేపట్టాలి
X

దిశ, కరీంనగర్ రూరల్ : గత ప్రభుత్వాల తలాదన్నేలా కరీంనగర్ నగరపాలక సంస్థ ను అభివృద్ధి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ కోరారు. గురువారం నూతనంగా ఎన్నికైన కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ను 46వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి ప్రకాశ్ ను వారిని కలసి శాలువాతో సత్కరించి తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో నిధులు మరలించారని అన్నారు. ఈ నూతన కార్యవర్గంలో నగర పాలక సంస్థ అభివృద్ధి దిశగా కొనసాగించాలని, బీసీ సంక్షేమ సంఘం భవనానికి రెండు ఎకరాల భూమిని కేటాయించాలని కోరామ‌ని అన్నారు. అన్ని డివిజన్ లో గెలుపొందిన కార్పొరేటర్లు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్ పాల్గొన్నారు.

Next Story