- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరి సహకారంతో ధర్మపురి క్షేత్రం అభివృద్ధి
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని.. గత పాలకులు ధర్మపురి క్షేత్రాన్ని అసలే పట్టించు కోలేదని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు.

దిశ, ధర్మపురి : ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని.. గత పాలకులు ధర్మపురి క్షేత్రాన్ని అసలే పట్టించు కోలేదని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ సత్యప్రసాద్, దేవాదాయ శాఖ వైదిక సలహాదారు గోవిందుల హరి తో కలిసి మంగళవారం మంత్రి అడ్లూరి ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం టెంపుల్ మాస్టర్ ప్లాన్ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా తో మాట్లాడారు. 2027 లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారని మంత్రి అడ్లూరి తెలిపారు. గోదావరి తీరం వెంట ఉన్న పలు ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని మంత్రి వివరించారు.
గోదావరి తీరంలో ఉన్న భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం మాస్టర్ ప్లాన్, టెంపుల్ సిటీ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రారంభించారని మంత్రి వివరించారు. బాసరలోని సరస్వతి అమ్మవారు కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ అమలుతో పాటు టెంపుల్ సిటీ నిర్మాణ పనులకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశాలు చేశా రని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ తోపాటు పలువురు అధికారులు కలిసి మాస్టర్ ప్లాన్ అమలు తీరును పరిశీలించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారని మంత్రి వివరించారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రజల నుంచి సహకారం కావాలని మంత్రి కోరారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో ధర్మపురి క్షేత్ర మాస్టర్ ప్లాన్ అమలతో పాటు టెంపుల్ సిటీ నిర్మాణ పనులు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.






