రేపు ధర్మపురిలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ప‌ర్య‌ట‌న

by Ratna Kumari |

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ధర్మపురి నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన ధర్మపురి పర్యటన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

రేపు ధర్మపురిలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ప‌ర్య‌ట‌న
X

దిశ, వెల్గటూర్ : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ధర్మపురి నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన ధర్మపురి పర్యటన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ధర్మపురి జూనియర్ కళాశాల గ్రౌండ్ కు హెలికాప్టర్ లో చేరుకుంటారు. ప్రత్యేక అధికారులతో సమావేశం అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజలు చేస్తారు . ఆతర్వాత రూ.200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 10 కోట్ల తో నిర్మించ బోతున్న డిగ్రీ కళాశాల భవనానికి,17 కోట్ల తో కట్ట నున్న సీవేజ్ ప్లాంట్ ఎస్సీ హాస్టల్ భవనానికి, ఎలక్ట్రికల్ లైన్ వర్క్స్ కు, 33 / 11కెవి సబ్ స్టేషన్లకు , వాటర్ సప్లై ఫెసిలిటేషన్, డిస్ట్రిబ్యూషన్ అండర్ ఫార్మ్ మెకానైజేషన్ స్కీం లకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆడ్లూరు లక్ష్మణ్ కుమార్ లు శంకుస్థాపన చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి నీ ఘనంగా స్వాగతించడానికి ధర్మపురి కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. ఇవే కాకుండా ధర్మపురి పై ఉప ముఖ్య మంత్రి మరిన్ని వరాల జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనతో ధర్మపురి దశ తిరగబోతుందని అందరూ అనుకొంటం విశేషం. ఇదిలా ఉంటే బట్టి పర్యటనలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసు కుండా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యంలో సీఐ రాం నరసింహ రెడ్డి ధర్మపురిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Next Story