కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణం కూల్చివేత..

by Elthuri vijay kumar |

మంథని పట్టణంలో అక్రమంగా నిర్మించిన రెండు అంతస్తుల నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. రెండు జేసీబీలతో కూల్చి వేస్తున్నారు.

కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణం కూల్చివేత..
X

కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణం కూల్చివేత..

పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీ సహాయంతో కూల్చివేసిన అధికారులు

దిశ, మంథని : మంథని పట్టణంలో అక్రమంగా నిర్మించిన రెండు అంతస్తుల నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. రెండు జేసీబీలతో కూల్చి వేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య రెండు జేసీబీల సాయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూల్చివేస్తున్నారు. ఫిర్యాదుదారు అక్రమంగా నిర్మిస్తున్నారని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత కోర్టు తీర్పు రావడంతో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మార్కింగ్ ఇచ్చిన ప్రకారం కూల్చి వేస్తున్నారు. అదే విధంగా మంథని పట్టణంలో అక్రమ నిర్మాణలను కూల్చివేయాలని కోర్టులో ఇదివరకే పలు పిర్యాదులు కూడా దాఖలాయ్యయి. కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని కుల్చివేస్తామని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా నిర్మాణం చేపట్టిన కట్టడాలను కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story