- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చూడముచ్చటైన గరుడ సేవ మహోత్సవం
గోవిందా నామస్మరణ మార్మోగింది. గంభరావు పేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి గరుడసేవ మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది.

దిశ,గంభీరావుపేట: గోవిందా నామస్మరణ మార్మోగింది. గంభరావు పేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి గరుడసేవ మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది. శ్రీరామ నవమితో మొదలుకొని తొమ్మిది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయం నుండి బయలుదేరిన శ్రీ సీతారామచంద్ర స్వామిని గరుడ సేవపై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల 8వ రోజు స్వామివారి గరుడసేవ మహోత్సవం జరగగా.. మరుసటి తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం జరగనుంది. గరుడ సేవ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి మంగళహారతులతో పాటు కట్న కానుకలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొని భక్తులకు గ్రామంలోని వివిధ స్వచ్ఛంద సంఘాలు నీటి సౌకర్యంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. గరుడ సేవ మహోత్సవంలో పోత రాజుల నృత్యాలు డప్పు చప్పులు పలువురి ఆకట్టుకున్నాయి. స్వామివారి గరుడ సేవ బ్రహ్మోత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ దగ్గరుండి ఏర్పాట్లు చేశారు.
- Tags
- karimnagar news






