- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లి, తండ్రి మృతి.. అనాధలైన పిల్లలు
తల్లి, తండ్రిని కోల్పోయి గంభీరావుపేట మండల కేంద్రంలో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఇద్దరు పిల్లలు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి వారిది.

దిశ, గంభీరావుపేట : తల్లి, తండ్రిని కోల్పోయి గంభీరావుపేట మండల కేంద్రంలో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఇద్దరు పిల్లలు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి వారిది. దీంతో ఆర్థిక సహాయం చేయాలని, వారిని ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామ ప్రజలు. వివరాల్లోకి వెళ్లితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కట్ట సుమలత గత ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి తన భర్త అయిన కట్ట శ్రీనివాస్ అన్ని తనై పిల్లలను చూసుకుంటూ జీవనం కొనసాగించాడు. మూడు నెలల క్రితం కట్ట శ్రీనివాస్ కు(43) హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో అప్పటినుంచి ఆరోగ్యం సరిగ్గా లేక మంచాన పడ్డాడు. వారి పరిస్థితి చూడలేక ముదిరాజ్ కులస్తులు, ఇతర ప్రజలు చందాలు జమ చేసి వారి కుటుంబానికి ఇచ్చారు. శనివారం తండ్రి కట్ట శ్రీనివాస్ కూడా మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. కొడుకు వినయ్(12) ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుండగా, కూతురు కట్ట లాస్య(10) ఐదవ తరగతి ప్రభుత్వ పాఠశాల చదువుతుంది. నిరుపేద కుటుంబం అవ్వడంతో వారికి స్థానిక నాయకులు కానీ ఇతర ఎవరైనా సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. తల్లిదండ్రులు లేక అనాధలైన పిల్లలు ఉన్నంత చదువులు చదవడానికి సహాయం చేయాలని, కనీసం ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వపరంగా గాని స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కానీ ఎంపీ బండి సంజయ్ కానీ ప్రభుత్వ పరంగా అనాధ పిల్లలకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఒక ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఎవరైనా పిల్లలకు సహాయం చేయదలచుకునేవారు. ఈ నెంబర్లకు డబ్బులు పంపించాలని కోరుతున్నారు. (8790757111),,(8885297098) ఫోన్ పే అండ్ గూగుల్ పే పిల్లలు బాగుకోసం తలా కొంత సహాయం చేయాలని చిన్నారులు కోరుతున్నారు.






