- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకులంలో విద్యార్థి ఆరోగ్యంతో చెలగాటం
కరీంనగర్ జిల్లా మాన కొండూరు మండలంలోని దేవంపల్లి గురుకుల బాలుర పాఠశాల విద్యార్థుల సంరక్షణ చూడాల్సిన యజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని తల్లితండ్రులు వాపోతున్నారు.

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా మాన కొండూరు మండలంలోని దేవంపల్లి గురుకుల బాలుర పాఠశాల విద్యార్థుల సంరక్షణ చూడాల్సిన యజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని తల్లితండ్రులు వాపోతున్నారు. దేవంపల్లి గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు తమ గ్రామం నుండి హుటాహుటిన హాస్టల్ వద్ద కు చేరుకున్నారు.
గంటల తరబడి నిరీక్షణ ఫలించని వైనం
తమ కుమారుడి ఆరోగ్యం పట్ల ఆందోళనతో సాయంత్రం 4 గంటలకే మందులతో హాస్టల్ గేటు వద్దకు చేరుకున్న తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది.మందులను ఎలా వాడాలో చెబుదామంటే ఎవరు అందుబాటులో లేరని అటు పిల్లవాణ్ణి హాస్టల్లోకి పంపలేక ఇటు తీసుకు వెళ్లలేక సతమతమవుతున్నట్లు తెలిపారు. రాత్రి 7 గంటలు గడిచినా తాము తెచ్చిన మందులను లోపలికి పంపేందుకు సిబ్బంది నిరాకరించారు. కనీసం వచ్చి మందులు తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేయగా.. "మేము అంతే, విద్యార్థిని బయటకు పంపము, మీరు తెచ్చిన మందులను లోపలికి అనుమతించము" అంటూ దురుసుగా సమాధానం ఇచ్చినట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అనారోగ్యంతో ఉన్న పసివాడిని చూసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై వారు మీడియాను ఆశ్రయించగా దిశ, రిపోర్టర్ ప్రిన్సిపాల్ ను ఫోన్లో వివరనకోసం ఫోన్ చేయగా ఫోన్ లిప్ట్ చేయలేదు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, స్కూల్ ముందే మందులు పట్టుకొని గంటల తరబడి వేచి ఉన్నా కనికరం చూపని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.






