డీబీఎల్ దోపిడీ.. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలింపు

by I. Sairam |

కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగిత్యాల వరంగల్ నేషనల్ హైవే పనులను దక్కించుకున్న డీబీఎల్ కంపెనీ రోడ్డు నిర్మాణం పేరిట అక్రమ మట్టి దందాకు తెరలేపింది.

డీబీఎల్ దోపిడీ.. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలింపు
X

దిశ బ్యూరో, కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగిత్యాల వరంగల్ నేషనల్ హైవే పనులను దక్కించుకున్న డీబీఎల్ కంపెనీ రోడ్డు నిర్మాణం పేరిట అక్రమ మట్టి దందాకు తెరలేపింది. కోట్ల రూపాయల విలువచేసే మట్టిని అక్రమంగా తరలించి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టింది. అక్రమ మట్టి దందాపై ఫిర్యాదులు ఎన్నివచ్చినా పట్టించుకోకుండా అక్రమ దందా దర్జాగా సాగించింది. కోట్ల రూపాయల విలువ చేసే నేషనల్ హైవే రోడ్డు పనులను దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వ రోడ్డు పనులకు అక్రమంగా మట్టితరలించడాన్ని పసిగట్టిన దుద్దెనపల్లి పాలకవర్గ సభ్యులు అడ్డుకోవడంతో డీబీఎల్​సంస్థ సాగిస్తున్న అక్రమ మట్టిదందా వెలుగులోకి వచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది .

గుట్టలను మింగేసిన డీబీఎల్ కంపెనీ..

జగిత్యాల వరంగల్ నేషనల్ హైవే నిర్మాణా పనులు చేపట్టిన డీబీఎల్​కంపెనీ యాజమాన్యం ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండా దారి పొడవునా మట్టి గుట్టలను గుళ్లా చేసింది. దొరికితే దొంగ లేదంటే దొరలా వ్యవహరిస్తూ అక్రమ మట్టి దందాను సాగించింది. మట్టి తరలింపు పై విమర్శలు వచ్చినా స్థానికులు అడ్డుకున్నా నామ మాత్రపు చెల్లింపులు చేసి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టింది. అయితే మట్టి తరలింపు రాత్రింబవళ్లు సాగినా అధికారులు మాత్రం ఎక్కడా అడ్డు చెప్పకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారడంతోనే ఎక్కడా అధికారులు అడ్డు చెప్పకుండా కంపెని అక్రమ మట్టి తరలింపుకు సహాయ సహకారాలు అందించారని స్థానికులు అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

పాలకవర్గం అడ్డుకోవడంతో బయటపడ్డ దందా..

నేషనల్ హైవే పనులకు మానకోండూర్ మండలం గట్టుదుద్దెన పల్లి గ్రామ సమీపంలోని గుట్టలనుంచి మట్టి తరలించడం పై అనుమానం వచ్చిన నూతన పాలకవర్గం అడ్డుకోవడం తో అసలు బాగోతం బహిర్గతమైంది.ముందుగా గ్రామస్తులను దబాయిస్తు పోలీసులకు సమాచారం అందించి అదరగొట్టేందుకు ప్రయత్నం చేసిన డీబీఎల్​అధికారులు మట్టి తరలింపునకు పర్మిషన్ ఉందా ఉంటే చూపించండి అట్టు నిలదీయడంతో తోక ముడిచిన కంపెనీ అధికారులు మట్టి తరలించేందుకు డబ్బులు కట్టగా ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మట్టిని తరలించిన డీబీఎల్​కంపెనీ ప్రభుత్వానికి చెల్లించింది ఎంత దోచుకున్న మట్టి ఎంత అనేది స్థానికంగా చర్చానీయంశంగా మారి డీబీఎల్​ అక్రమ మట్టి దందా పై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

అడుగడుగునా అక్రమాలే..

కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నా జగిత్యాల వరంగల్ జాతీయ రహదారి పనులు దక్కించుకున్న డీబీఎల్​కంపెనీ అడుగడుగునా అక్రమాలకు తెరలేపి పనులు సాగిస్తుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే డీబీఎల్​కంపెనీ కేంద్ర ప్రభుత్వంలో ఓ బడా నాయకుడికి సంబంధించినది కావడం స్థానికంగా ఉన్న ఎంపీ కేంద్రమంత్రిగా ఉండటం చేత ఏ అధికారి డీబీఎల్​కంపెనీకి అడ్డుచెప్పే సాహసం చేయకపోవడం చేత అడుగడుగునా నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ నేషనల్ హైవే పనులను సాగిస్తుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మట్టి గుట్టలను గుల్లా చేయడంతో పాటు ప్రభుత్వ భూముల్లో సైతం అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టి మట్టిని తరలించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Next Story