అమ్మకన్నా బంగారమే ఎక్కువ

by Bhanu |

అమ్మను మించి దైవమున్నద అని అమ్మ గొప్పదనం గురించి ఒక సినీ గేయ రచయిత మాటలు కేవలం చెప్పుకోవడానికేనా? ఒక అమ్మ పడే పురిటి నొప్పుల బాధ మరొక అమ్మకే తెలుస్తుంది

అమ్మకన్నా బంగారమే ఎక్కువ
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : అమ్మను మించి దైవమున్నద అని అమ్మ గొప్పదనం గురించి ఒక సినీ గేయ రచయిత మాటలు కేవలం చెప్పుకోవడానికేనా? ఒక అమ్మ పడే పురిటి నొప్పుల బాధ మరొక అమ్మకే తెలుస్తుంది అంటారు. కానీ అలాంటి అమ్మను చనిపోయాక కర్మ ఖాండలు చేయాల్సి వస్తుందని ఓ కూతురు అడవిలో వదిలేసింది. పండుటాకు మెడలో ఉన్న బంగారు నగలను తీసుకొని తీసుకుని మనుషులు తచ్చాడని అడవిలో వదిలేసి వెళ్ళింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే జిల్లా కేంద్రం లోని ఇస్లాంపుర వీధిలో ఉండే భూదవ్వ కు ఈశ్వరి అనే కూతురు ఉంది.అయితే రెండు రోజుల క్రితం ఈశ్వరి తన తల్లిని అడవికి తీసుకెళ్లి ఆమె మెడలోని బంగారు ఆభరణాలు తీసుకుని భూదవ్వను అడవిలో వదిలి పరారైంది. రెండు రోజులుగా అడవిలో తిండి తిప్పలు లేక తల్లడిల్లిన భుదవ్వ 5 కిలోమీటర్ల కు పైగా నడిచి ఓ చోట సొమ్మసిల్లి పడిపోయింది. అటుగా వెళ్లిన కొందరు స్థానిక యువకులు గమనించి అధికారులకు సమాచారం అందించగా పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.


Next Story