- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ విగ్రహం తొలగింపుపై దళిత సంఘాల ఆగ్రహం
అంబేద్కర్ విగ్రహ తొలగింపు పై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళిత సంఘాల నాయకులు నిరసన ర్యాలీ, రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు.

అంబేద్కర్ విగ్రహం తొలగింపుపై దళిత సంఘాల ఆగ్రహం
- కిసాన్ నగర్ లో నిరసన ర్యాలీ
- గాంధీ చౌరస్తాలో రాస్తారోకో
దిశ, కరీంనగర్ టౌన్ : అంబేద్కర్ విగ్రహ తొలగింపు పై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళిత సంఘాల నాయకులు నిరసన ర్యాలీ, రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ కిసాన్ నగర్ లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట దొంగతనంగా అవమానకరమైన పద్ధతిలో తొలగించడాన్ని నిరసిస్తూ గురువారం కిసాన్ నగర్ డివిజన్ ప్రజలు, దళిత సంఘాలతో కలిసి విగ్రహం తొలగించిన చోట నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ వద్దకు చేరుకొని రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకొని.. నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు కంసాల శ్రీనివాస్, నక్క ప్రమోద్ , గోస్కి శంకర్ లు మీడియాతో మాట్లాడారు.. నగరపాలక సంస్థ ఫుట్ బోర్డు పైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని.. వారి జయంతి వర్ధంతి లకు వేడుకలు కూడా నిర్వహించు కుంటున్నామని.. అయితే అంబేద్కర్ అంటే పడని కొంతమంది దుర్మార్గులు హైకోర్టులో కేసు వేసి తొలగించుటకు ఆర్డర్ తీసుకొని రావడం... దానికి అధికారులు పోలీసులు కుట్రపూరితంగా అర్ధరాత్రి పూట ఎవరికి సమాచారం ఇవ్వకుండా దొంగతనంగా అవమానకరమైన పద్ధతిలో విగ్రహాన్ని జేసీబీతో తొలగించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని అన్నారు. ఎవరో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా .. ప్రభుత్వ అధికారులు విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరమన్నారు. ఉమ్మడి జిల్లా నుండి మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ దీనికి బాధ్యత వహించి దళితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిరిగి విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని.. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి దేశాలు సరైన రాజ్యాంగం లేక అట్టడుగుతున్నాయని ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఆ మహానుభావున్నీ ఈ విధంగా అవమానించడం సిగ్గుచేటు అని కంసాల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతి, నక్క ప్రమోద్, సంపతి, అశోక్, కళ్ళేపల్లి నవీన్, ధర్పల్లి క్రాంతి, జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ క్యాదాసి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు గజ్జల ఆనందరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు దండు అంజయ్య , వరలక్ష్మి, గొర్రె రాజయ్య, గాలి అనిల్, దీకొండ శేఖర్, వినోద్, కాశిపాక అశోక్, వడ్లూరి లక్ష్మణ్, మేక లక్ష్మణ్, దళిత సంఘాల నాయకులు గోస్కి శంకర్ తదితరులు పాల్గొన్నారు.






