యూజీడీల నిర్మాణం పై పూర్తి స్థాయి విచారణ జరపాలి : సీపీఐ

by Ratna Kumari |

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ట్రాన్స్ ఫ‌ర్ డ్యూటీ ఫండ్స్ కి సంబంధించిన రూ. 13 కోట్ల 70 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించి ఏడు ప్యాకేజీల టెండర్ల లో జరిగిన అవినీతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.

యూజీడీల నిర్మాణం పై పూర్తి స్థాయి విచారణ జరపాలి : సీపీఐ
X

దిశ, గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్స్ కి సంబంధించిన 13 కోట్ల 70 లక్షల రూపాయలను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించి ఏడు ప్యాకేజీల టెండర్ల లో జరిగిన అవినీతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో CPI నగర కార్యదర్శి కె కనకరాజ్, సీపీఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడారు. టెండర్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి, విచారణ జరిగేంతవరకు అట్టి బిల్లులు చెల్లించకుండా చర్యలు తీసుకోవాలని, అవినీతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రామగుండం కార్పొరేషన్ లో కాంట్రాక్టర్లు సిండికేట్ గా మారి 0.5 టు 1.5% లెస్ పర్సంటేజ్ తో ఆ పనులను దక్కించుకోవడం వెనుక అధికారులు, కాంట్రాక్టర్లు భారీ అవినీతికి పాల్పడ్డట్టుగా స్పష్టంగా కనిపిస్తుందని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఇట్టి టెండర్ పనులు ఆర్సిసి పైపులు వినియోగించడంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నాణ్యతతో నిర్మించడం చాంబర్లను నాణ్యతతో కట్టాలని వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ టెండర్స్ పొందిన కాంట్రాక్టర్లు నాసిరకం పనులు నిర్వహించారని, ఆర్సీసీ పైపులకు బదులుగా మట్టి పైపులను వాడి నాణ్యత ప్రమాణాలను పాటించకుండా యూజీడీలు నిర్మించారని సూర్య ఆరోపించారు.


సీడీఎంఏ నిబంధనల ప్రకారం ట్రాన్స్ ఫ‌ర్ డ్యూటీ ఫండ్స్ కార్మికుల జీతభత్యాలకు గాని మున్సిపల్ ఎమర్జెన్సీ వ్యవహారాలకు వాడాల్సి ఉన్నప్పటికీ కమిషన్లకు ఆశపడి ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు కార్పొరేషన్ కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఆ డబ్బును అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఏడు ప్యాకేజీలుగా కేటాయించే విధంగా చేసుకొని అతి తక్కువ లెస్ పర్సెంటేజ్ తో ఈ పనులు దక్కించుకోవడం జరిగిందని అన్నారు. కాబట్టి రామగుండం కమిషనర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, క్వాలిటీ కంట్రోల్ విభాగంతో నాణ్యత ప్రమాణాలు చెక్ చేయాలన్నారు. ఈ అవినీతిలో భాగస్వామ్యమైన అధికారుల పైన, కాంట్రాక్టర్ల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ విచారణ పూర్తయినంతవరకు ఇట్టి బిల్లులను చెల్లించకుండా ఉండాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారులు అట్టి బిల్లులు చెల్లిస్తే రేపు శాఖాపరమైన న్యాయపరమైన చర్యలకు బలికాక తప్పదని హెచ్చరించారు. 24 తారీకు వరకు ఇంకా 125 మంది కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం దారుణమని, అధికారుల పొట్ట నింపుకోవడానికి కార్మికుల పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రేపటిలోగా కార్మికుల జీతాలు చెల్లించినట్లయితే 26 తారీకున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యవర్గ సమావేశంలో గోశిక మోహన్, మాటేటి శంకర్, శనిగరపు చంద్రశేఖర్, రేణిగుంట్ల ప్రీతం, తొడుపునురి రమేష్, రాణవేణి సుధీర్, ఆసాల నవీన్, శనిగరపు తిరుమల, సాధుల శివ, పోతరాజు నాగరాజు పాల్గొన్నారు.

Next Story