నంచర్లలో విద్యుత్ తీగలు తెగి మూడు పాడి గేదెల మృతి

by Bhanu |

నంచర్ల గ్రామంలో విద్యుత్ వైర్లు తెగిపడి మూడు పాడి గేదెలు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

నంచర్లలో విద్యుత్ తీగలు తెగి మూడు పాడి గేదెల మృతి
X

దిశ, పెగడపల్లి : నంచర్ల గ్రామంలో విద్యుత్ వైర్లు తెగిపడి మూడు పాడి గేదెలు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి ఈదురు గాలులు విరుచుకుపడడంతో గ్రామంలోని ఒక విద్యుత్ స్థంభం విరిగి పడింది. ఫలితంగా విద్యుత్ తీగలు నేలపై పడిపోవడంతో కత్తి లచ్చయ్య, కొత్త రవి, వరాల సంపత్‌కు చెందిన మూడు పాడి గేదెలు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి.

ఈ ఘటనపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ... విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. మృతిగొన్న గేదెల విలువ రెండు లక్షల రూపాయలకు పైగా ఉంటుందని పేర్కొంటూ, ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Next Story