- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాల రైతు బజార్‌లో కౌన్సిలర్ భర్త హంగామా
జగిత్యాలలోని రైతు బజార్‌లో 22వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అరవ లక్ష్మి భర్త ఏసీఎస్ రాజు హంగామా సృష్టించిన ఘటన కలకలం రేపింది.

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల పట్టణంలోని రైతు బజార్‌లో 22వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అరవ లక్ష్మి భర్త ఏసీఎస్ రాజు హంగామా సృష్టించిన ఘటన కలకలం రేపింది. మార్కెట్‌లో వ్యాపారం చేస్తున్న ఓ వర్గం వారితో ఆయన వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. సాయంత్రం సమయంలో రైతు బజార్‌కు వచ్చిన ఏసీఎస్ రాజు, అకారణంగా తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ “మీ వర్గం వారు ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదు” అంటూ కేకలు వేస్తూ హంగామా చేశారని బాధితులు ఆరోపించారు.
మద్యం మత్తులో నోటికి వచ్చినట్లు మాట్లాడడమే కాకుండా, తాను ప్రజా ప్రతినిధి అంటూ లైసెన్సులు చెక్ చేయడానికి వచ్చానని చెప్పి దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం షేక్ మహమ్మద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌన్సిలర్ భర్త ఏసీఎస్ రాజుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.






