- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోరుట్ల ఆర్డీవో కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
కోరుట్ల ఆర్డీవో కార్యాలయాన్ని గురువారం కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను త్వరగా ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.

దిశ, కోరుట్ల టౌన్ : కోరుట్ల ఆర్డీవో కార్యాలయాన్ని గురువారం కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను త్వరగా ఇవ్వాలని, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును శూన్యంగా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని, మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ మ్యాపింగ్ లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, తప్పు ఎంట్రీ లు జరగకుండా ప్రతి ఓటరు మ్యాప్ అయ్యేవిధంగా ప్రతి ఇంటినుండి ఖచ్చితమైన, నిర్ధిష్టమైన వివరాలు సేకరించేలా అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.






