మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి

by Disha Web Desk 1 |
మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల మున్సిపల్ సానిటేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో విపరీతంగా అవినీతి జరుగుతోందని పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్స్ బుధవారం జరిగిన జగిత్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్ ఆసియా సుల్తానా పోడియం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణ దశాబ్జి ఉత్సవాల నిర్వహణలో అవినీతి, అక్రమాలు జరగకుండా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు కల్లపెల్లి దుర్గయ్య, నక్క జీవన్, మూలస్తం లలిత, ఆసియాసుల్తానా, సహారాభాను, పర్విన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed