- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామపంచాయతీకి తాళం వేసిన కాంట్రాక్టర్..!
నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణం చేపట్టినా బిల్లులు రెండేళ్లు గడిచినా రాకపోవడంతో ఆవేదన చెంది గ్రామపంచాయతీకి తాళం వేశాడు కాంట్రాక్టర్.

దిశ, కోనరావుపేట : నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణం చేపట్టినా బిల్లులు రెండేళ్లు గడిచినా రాకపోవడంతో ఆవేదన చెంది గ్రామపంచాయతీకి తాళం వేశాడు కాంట్రాక్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని, కనగర్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి బుధవారం కాంట్రాక్టర్ అండెం మల్లారెడ్డి తాళం వేశారు. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్నా తనకు రావాల్సిన రూ.1.50 లక్షల బిల్లు ఇప్పటికీ చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ అండం మల్లారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో మంజూరైన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించడానికి రూ. 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం.. భవనం డబ్బులు సరిపోకపోవడంతో అదనంగా రూ.1.50 వేలు అవుతున్నాయని మాజీ సర్పంచ్ పాలకవర్గం సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు గ్రామ, మండల అధికారులు బిల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
అది కూడా అదనపు నిర్మాణాలు కోసం మరల భవనానికి వేసిన కలర్స్ నచ్చక రెండోసారి కలర్స్ వేయమని ఇబ్బందులకు గురిచేశారు. అయినా కూడా చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా...ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చెందారు. తను ప్రస్తుతం అనారోగ్యంతో ఉండటంతో డబ్బులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం ముందుండి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం కష్టపడితే తాను తీవ్రంగా నష్టపోయానని వాపోయారు. ఇప్పటికైనా ఒప్పందం ప్రకారం.. తనకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని అధికారులను, గ్రామ పాలక వర్గాన్ని వేడుకుంటున్నట్టు కాంట్రాక్టర్ మల్లారెడ్డి తెలిపారు. నాకు వచ్చే బిల్లు చెల్లించకపోవడంతోనే పంచాయతీ భవనానికి తాళం వేసాను అని స్పష్టం చేశారు. తనకు వచ్చే బిల్లనులను చెల్లించి న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు.






