- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలగానే హైలెవల్ వంతెన నిర్మాణం.. దశాబ్దాల ఇబ్బందులకు మోక్షమెపుడో?
బోయినిపల్లి మండల కేంద్రానికి సమీపంలో వేములవాడకు వెళ్లే దారిలో కాలువపై ఆనాటి రవాణా అవసరాలకు తగినట్లుగా లో-లెవల్ వంతెన నిర్మించారు.

వర్షాకాలం సమీపిస్తుందంటనే ఆ మండల ప్రజలు జంకుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో అటు వైపుగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగాయని, ఇంకా ఎన్ని జరుగుతాయోననే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతున్నారు. అటకెక్కిన నాయకుల హామీలతో ఆ చోట హై లెవెల్ వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దశాబ్దకాలం నుంచి పడుతున్న తిప్పలు తప్పేదెన్నడోనని మండల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. బోయినిపల్లి మండల కేంద్రానికి సమీపంలో వేములవాడకు వెళ్లే దారిలో కాలువపై ఆనాటి రవాణా అవసరాలకు తగినట్లుగా లో-లెవల్ వంతెన నిర్మించారు. అయితే కాలం గడుస్తున్నా కొద్దీ అటు వైపు వెళ్లే వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీనికి తోడు కొన్నేళ్లుగా కాలువకు వరద ఉదృతి పెరగడంతో వంతెన మొత్తం నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. హై లెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలని దశాబ్ద కాలంగా కోరుతున్నప్పటికీ అది కలగానే మిగులింది.
దిశ, బోయినిపల్లి : బోయినిపల్లి మండల కేంద్రానికి సమీపంలో వేములవాడకు వెళ్లే దారిలో కాలువపై ఆనాటి రవాణా అవసరాలకు తగినట్లుగా లో-లెవల్ వంతెన నిర్మించారు. అయితే కాలం గడుస్తున్నా కొద్దీ అటు వైపు వెళ్లే వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీనికి తోడు గత కొన్నేళ్లుగా కాలువకు వరద ఉదృతి పెరగడంతో వంతెన మొత్తం నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అత్యవసర సమయాలలోనైతే అటుగా వెళ్లే వారి పరిస్థితి దయానీయంగా మారింది. దీంతో అక్కడ హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు దశాబ్ద కాలంగా కోరుతున్నప్పటికీ అది కలగానే మిగులుతుందే తప్పా వంతెన నిర్మాణానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. ప్రతిసారి ఇటు వైపు వచ్చిన నాయకులు వంతెన నిర్మిస్తామని చెబుతున్నారే తప్పా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. నాయకుల మాటలు నీటి మూటలు గానే మిగిలాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
రాకపోకలు బంద్..
ప్రతి వర్షాకాలంలో సమీపంలోని వాగులు, కుంటలు, చెరువులు, కాలువలు పొంగి పొర్లుతుండడంతో లో లెవెల్ వంతెనకు వరద ఉధృతి అధికమై అటువైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రం నుంచి బూరుగుపల్లి, కోరెం, అనంతపల్లి, దుండ్రపల్లి, స్తంభంపల్లి, గుండన్నపల్లి గ్రామాలతోపాటు వేములవాడ, సిరిసిల్ల జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటేనే కష్టతరంగా మారుతుంది. దీనిపై మండలంలోని ఓ యువజన సంఘం సభ్యులు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సంఘం సభ్యులు సైతం అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇక్కడ వంతెనతోపాటు పక్కనే లోతైన బావి ఉందని దానిని సైతం తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలి.. గుంటి లతాశంకర్, తాజా మాజీ సర్పంచ్
ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఇలానే ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ వంతెనపైనుంచి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము సర్పంచ్‌గా ఉన్న సమయంలో హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం శాయశక్తులా కృషి చేశాం. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తా.. ఏనుగుల అనిల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
మండల ప్రజలు ఎదుర్కొంటున్న బ్రిడ్జి సమస్యను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్తాను. ఈ వేసవి కాలం ముగిసే లోపే బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా నా వంతు ప్రయత్నం చేస్తాను.






