- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణిని నామరూపాలు లేకుండా చేసేందుకు కుట్రలు
సింగరేణి సంస్థను నామ రూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

దిశ, గోదావరిఖని : సింగరేణి సంస్థను నామ రూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం ఆర్ జి -1, ఓసిపి 5 లో శుక్రవారం రామగుండం బొగ్గు నిల్వలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, టీజీబీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి తో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వం చూపిస్తున్న బొగ్గు నిల్వలు లెక్కల వాస్తవాలు వివరించారు. సింగరేణి సంస్థలో వరుస కుంభకోణాలతో సంస్థనే ప్రశ్నార్థకం చేసేలా దోపిడి జరుగుతాందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కుంభకోణాలకు తెరలేపుతోందన్నారు. ఒకప్పుడు సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ అని, లక్షల కుటుంబాలు బ్రతుకుదెరువు చూపించిన సంస్థ అని ఆయన వివరించారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీ కాంట్రాక్టర్‌లు, సోలార్ పవర్ ప్లాంట్, డెటోనేటర్ కాంట్రాక్ట్, పవర్ ప్రాజెక్టుల విషయంలో కుంభకోణాల పరంపర కొనసాగిస్తుందని ఆరోపించారు. అధికారిక లెక్కలు సింగరేణి వెబ్‌సైట్ ఉన్న లెక్కల ప్రకారం.. ఆర్జీవన్ ఓసీ 5లో ఆరులక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ చేసి ఉందని, సింగరేణి వ్యాప్తంగా ఆయా గనులపై నలభై లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని లెక్కల్లో ఉందన్నారు.
ప్రస్తుతం మూడు లక్షల అరువై వేల టన్నులు అని చెప్తున్నారని, కానీ ఇక్కడ మొత్తం మట్టి బెడ్డలు బండలు పనికి రాని వాటిని కుప్పలు చేసి బొగ్గు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని, కేవలం ఇక్కడ 50వేల మెట్రిక్ టన్నులు కూడా ఉన్నట్లు కన్పించడం లేదన్నారు. సంస్థను సర్వనాశనం చేయడంతో పాటు కార్మికుల జీవితాలు, ఆర్థిక అభివృద్దితో ఆటలు ఆడుతున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్ర మఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నేతృత్వంలోనే అనేక అరాచకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇక్కడ 40లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందనేది ఒక ఫేక్ అని ఆయన అన్నారు. నిల్వలు ఎక్కడెక్కడ చూపిస్తున్నరో అక్కడ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంపై సీబిఐ ఎంక్వైరీ జరుపాలని, లేని బొగ్గును ఎలా సృష్టిస్తరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని వృదా చేయడంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో అర్థం అవుతుందన్నారు. సింగరేణి ప్రజల ఆస్తి అని ఆ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభత్వంపై ఉందన్నారు. కాగా ఇటీవల గోదావరిఖనికి వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పలు విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారని, అందులో ముఖ్యంగా డిపెండెట్ ఉద్యోగాల విషయాన్ని ప్రస్థావించారని, నాలుగు వందల మంది కార్మికులను అన్‌పిట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని వెల్లడించారని, ఈ క్రమంలో అధికారులు ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందని జాగ్రత్త పడుతున్నారని, రెండు రోజుల్లో కార్మికులకు ఉద్యో గనియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారని తెలిపారు. వరుస కుంభకోణాలపై సమగ్రి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.






