800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం పనులు వేగవంతం చేయాలి

by velandi.Saikiran |

జెన్కో అధికారులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం పనులు వేగవంతం చేయాలి
X

దిశ, గోదావరిఖని: 800 మెగావాట్ల నూతన విద్యుత్ కేంద్రం పునఃప్రారంభానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జెన్కో సీఎండీ హరీష్ రావు బుధవారం రామగుండం జెన్కోను సందర్శించారు. జెన్కో అధికారులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సంద‌ర్భంగా నాయకులు మాట్లాడుతూ, రామగుండం ప్రాంత అభివృద్ధికి కీలకమైన 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా ప్లాంట్‌ను ప్రారంభించాలని కోరారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రామగుండం ప్రాంతంలో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని వారు పేర్కొన్నారు.

ప్రాంత ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం, జెన్కో అధికారులు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంసీ డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య యాదవ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దీటి బాలరాజు, కార్పొరేటర్లు ఎండీ ముస్తఫా, ఈసంపెల్లి అంజయ్య, మాజీ కార్పొరేటర్ సలీం, మహమ్మద్, రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరి ప్రసాద్, నాయకులు ఉస్మాన్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story