- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామినేటెడ్' పోటాపోటీ.. సహకార సంఘాలపై కాంగ్రెస్ నేతల కన్ను..!
రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల నామినేటెడ్ పదవుల నియామకానికి ప్రభుత్వం సిద్ధమైంది. కాగా సైదాపూర్ మండలంలో రెండు సహకార సంఘాలకు 26 డైరెక్టర్ పదవులు భర్తీ కానున్నాయి. పదవుల కోసం కాంగ్రెస్ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ ఇన్చార్జిల చుట్టూ తిరుగుతున్నారు.

దిశ, సైదాపూర్: రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల నామినేటెడ్ పదవుల నియామకానికి ప్రభుత్వం సిద్ధమైంది. కాగా సైదాపూర్ మండలంలో రెండు సహకార సంఘాలకు 26 డైరెక్టర్ పదవులు భర్తీ కానున్నాయి. పదవుల కోసం కాంగ్రెస్ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ ఇన్చార్జిల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం సూచించింది. సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారినే పదవులకు ఎంపిక చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. కాగా మంత్రి సీనియర్ నాయకులు అభ్యర్థుల జాబితాను గోప్యంగా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఏ క్షణాన్నైనా ప్రభుత్వం నుంచి అధికారికంగా నామినేటెడ్ పదవుల జాబితా వెలువడే అవకాశం ఉంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా నామినేటెడ్ ప్రాతిపదికన చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ లను ఎంపిక చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొత్త పాలకవర్గాలను నియమించే వరకు పాతవారినే కొనసాగించాలని తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పద్ధతిలో పదవులను ఇవ్వాలని ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ఆయా సొసైటీలలో ఎవరెవరికి పదవులు ఇవ్వాలనే అంశంపై స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంత్రి, నియోజక వర్గాల ఇన్చార్జీలు జిల్లా అధ్యక్షులు సూచన చేసినట్లు తెలిసింది. ఈ జాబితాను తయారుచేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కు అందించినట్లు సమాచారం. కాగా ఎలాగైనా తమకు పదవులు చేజిక్కించుకోవాలనే ఆశతో ఉన్నవారు మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
మంత్రి చుట్టూ ప్రదక్షిణలు
ప్రభుత్వం నియమించనున్న సొసైటీల చైర్మన్, వైస్ చైర్మన్ లతో పాటు డైరెక్టర్ల నియామకాల జాబితాలో తమ పేర్లు ఎలాగైనా ఉండాలనే ఉద్దేశంతో స్థానిక అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం.
గోప్యంగా జాబితాలు
సొసైటీలో నియమించబోయే పదవుల జాబితాలను మంత్రితోపాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు గోప్యంగా తయారు చేసినట్లు తెలుస్తుంది. గత పంచాయతీ ఎన్నికలతో పాటు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైన స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం లేని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు, పదవుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం పార్టీ అధిష్టానం కూడా ఇదే సూచనలు చేసినట్లు తెలిసింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉంటూ పదవులు పొందని వారిని గుర్తించాలని కూడా సూచన చేసినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల ఎంపికలో ముఖ్యంగా సొసైటీలో సభ్యత్వం ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. తమకు అనుకూలంగా ఉన్నవారితో పాటు సొసైటీలో సభ్యత్వం ఉన్నవారికి ఎంపిక చేయడం స్థానిక నేతలకు కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నప్పటికీ నిబంధనతో అర్హూలకు పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అర్హులకు పదవులు దక్కేనా..?
నామినేటెడ్ పద్ధతిలో సహకార సంఘాలకు పాలక వర్గాలను నియమిస్తే పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన పదవులకు దూరంగా ఉన్న నేతలకు ఈ పదవులు అప్పగించే అవకాశం ఉందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లో ఉంటూ అప్పుడప్పుడు గ్రామాలకు వచ్చేవారికి పదవులు అప్పగిస్తే వ్యవసాయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఆ నాయకులకు ఎలాగా తెలుస్తాయని పలువురు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోనే నివసిస్తూ వ్యవసాయం చేస్తూ చిన్న, సన్నకారు రైతుల కష్టసుఖాల్లో భాగస్వాములయ్యే వారికి సహకార సంఘాల పాలకవర్గాల్లో అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
అనర్హులను అందలం ఎక్కిస్తే ఉరుకోం..
నామినేటెడ్ పదవుల్లో అనర్హులను అందలం ఎక్కిస్తే ఉరుకునే ప్రసక్తి లేదని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎన్నికల ముందు ఇతర పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్టీలోకి వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదని, గత 10యేళ్లుగా పార్టీని పట్టుకొని కష్టాలు ఎదుర్కొన్న నిజమైన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి కార్యకర్తలను గుర్తించాలని కోరుచున్నారు.
ఎస్సీ లేదా బీసీ వర్గాలకు చైర్మన్ పదవులు ఇవ్వాలి
సహకార సంఘాల చైర్మన్ పదవులను ఎస్సీ లేదా బీసీ వర్గాలకు చెందిన వారికి కేటాయించాలని ఎస్సీ బీసీ వర్గాలకు చెందిన వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా సహకార సంఘాల చైర్మన్లుగా అగ్రకులాలకు చెందిన వారే ఉండడం గమనార్హం.






