చికిత్స పొందుతూ కాంగ్రెస్ నాయకుడు మృతి..

by Bhanu |

మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవీందర్ (50) ఈ నెల 17న బైకుపై వెళ్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కొదురుపాక, నాంపల్లి మధ్యలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది.

చికిత్స పొందుతూ కాంగ్రెస్ నాయకుడు మృతి..
X

దిశ, గన్నేరువరం : మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవీందర్ (50) ఈ నెల 17న బైకుపై వెళ్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కొదురుపాక, నాంపల్లి మధ్యలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో రవీందర్ పక్క ఎముకలు విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్ లో కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రవీందర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Next Story