- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి గత కొంతకాలంగా హైకమాండ్ తీరు పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి గత కొంత కాలంగా హై కమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ వీడతారనే ప్రచారం జరుగుతున్న తరణంలో పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించే పనిలో ఉన్నారు. మంగళవారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, జీవన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం అధిష్టానం సూచనల మేరకు ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకట స్వామి జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనతో భేటీ అయ్యారు. జీవన్ రెడ్డి ఇంట్లో సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీతో ఉన్న విభేదాలను చక్కదిద్దే దిశగా ఈ చర్చలు సాగినట్లు సమాచారం. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కత్తి వెంకట స్వామి.. “అధిష్టానం ఆదేశాలతోనే జీవన్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిని పార్టీ కోల్పోదని ఆయన ఎంతో ఆవేదనలో ఉన్నారు” అని తెలిపారు. “జీవన్ రెడ్డితో చర్చించిన అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. చివరి నిమిషంలో ఏదైనా పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది” అని వెల్లడించారు.






