- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

దిశ, చొప్పదండి : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో గురువారం స్వశక్తి మహిళా సంఘాల నూతన భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కాట్నపల్లి, సాంబయ్యపల్లి, కోనేరుపల్లి గ్రామాల 52 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలను గౌరవించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘటించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కర్రె ప్రేమలత శ్రీనివాస్,గన్ను శ్రీనివాస్ రెడ్డి, మాచెర్ల రమాదేవి జగన్ పటేల్,కాసు వేణుగోపాల్ రాజు ఉపసర్పంచ్ లు గన్ను నరేందర్ రెడ్డి, కొత్తపల్లి నవీన్, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ కొత్తూరి మహేష్ ,డైరెక్టర్ చుప్ప శ్రీనివాస్, మాజీ ఎంపిటీసీ లు కట్టెకోల లక్ష్మణ్, గాజంగి రాములు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజానపురం చందు, జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షులు రాజేశం, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






