- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా
రైతుల పెట్టుబడి కోసం అందించాల్సిన రైతు భరోసాను, ఎన్నికల కోసం మాత్రమే అందిస్తూ, ఈ పథకాన్ని ముఖ్యమంత్రి తన అవసరానికి వినియోగించుకుంటున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి ఆరోపించారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రైతుల పెట్టుబడి కోసం అందించాల్సిన రైతు భరోసాను, ఎన్నికల కోసం మాత్రమే అందిస్తూ, ఈ పథకాన్ని ముఖ్యమంత్రి తన అవసరానికి వినియోగించుకుంటున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి ఆరోపించారు. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం ఆయన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట స్థానిక బీజేపీ నాయకులతో కలిసి నిరసన తెలిపి అదనపు కలెక్టర్ కు మెమొరండం అందజేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్న ఎన్నికల్లో వాగ్దానం చేసిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దొంగ హమీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు వెంటపడతూ, ఈ నిరసన కార్యక్రమాలను ఆందోళన కార్యక్రమాలుగా మార్చి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, ప్రజలను చైతన్యవంతం చేసి కాంగ్రెస్ కి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.






