- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
మున్సిపల్ ఎన్నికల్లో ధర్మపురి ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను 15 స్థానాలకు 15 స్థానాల్లో గెలిపించారు.

దిశ, వెల్గటూర్ : మున్సిపల్ ఎన్నికల్లో ధర్మపురి ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను 15 స్థానాలకు 15 స్థానాల్లో గెలిపించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కనీసం ఖాతా ఓపెన్ చేయలేదు. వారు దరిదాపుల్లో లేని విజయాన్ని కాంగ్రెస్ వారు అందుకొన్నారు.ఈఎన్నికల్లో ధర్మపురి లో అన్ని తానే అయి బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఘోర పరాభవం ఎదురైంది. మంత్రి అడ్లూరిపై వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పటికీ అవేమి పట్టించుకోని ఓటర్లు వినూత్నమైన తీర్పునిచ్చి 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలను ధర్మపురి నుంచి ఊడ్చిపారేసి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించారు. మున్సిపల్ ఎన్నికల్లో ధర్మపురి లోనీ 15 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం చరిత్రలో గొప్ప విజయం భావించవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మంత్రి అడ్లూరి మాట్లాడారు. గడిచిన రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని మంత్రి అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మా బాధ్యతను మరింత పెంచిందనీ రాత్రి పగలు కష్టపడి ధర్మపురి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని ఆరు నెలల లోపు పూర్తి చేస్తామన్నారు .మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇకనైనాఅధిక ప్రసంగాలు మానుకొని బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి అడ్లూరి హితవు పలికారు. ధర్మపురి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై వ్యక్తిగతమైన ఆరోపణలు చేసినప్పటికీ అవి నిజం కావని భావించిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని మంత్రి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గడిచిన రెండు సంవత్సరాలుగా విద్య, వైద్యం ఆరోగ్యం వంటి అంశాలతో పాటు రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని ,మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి ఆలోచన విధానమే తమకు ఘన విజయం అందించింద న్నారు .మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పొంగిపోకుండా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రానున్న మూడు సంవత్స రాల్లో మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం లో నే వినూత్నమైన విజయాన్ని ధర్మపురిలో అందుకొని కాంగ్రెస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిలిచారని అందరూ అనుకోవటం విశేషంగా చెప్పుకోవచ్చు.






