- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసలైన తెలంగాణ తల్లి ఎవరు?.. అధికారుల తీరుతో ప్రజల్లో గందరగోళం..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకల్లో పలువురు పంచాయతీ కార్యదర్శులు వ్యవహరించిన తీరు ప్రజలను గందరగోళానికి గురిచేసింది.

దిశ, గొల్లపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకల్లో పలువురు పంచాయతీ కార్యదర్శులు వ్యవహరించిన తీరు ప్రజలను గందరగోళానికి గురిచేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతంతో పాటు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా గుర్తిస్తూ జీవో రిలీజ్ చేసింది. దీంతో అధికారిక కార్యక్రమాల్లో వీటినే వినియోగించాల్సి ఉంటుంది.
కానీ నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మండలంలోని కొన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన తెలంగాణ తల్లి చిత్రపటంను ఉపయోగించగా, మరికొన్ని పంచాయతీ కార్యాలయాల్లో మాత్రం గత బీఆర్ఎస్ హయాంలో చలామణిలో ఉన్న పాత తెలంగాణ తల్లి చిత్రపటంతో వేడుకలు నిర్వహించారు. దీంతో కార్యదర్శుల తీరుతో ప్రజలు అయోమయానికి గురవుతూ 'ఇంతకీ అసలైన తెలంగాణ తల్లి ఎవరు'? ప్రభుత్వం అధికారికంగా గుర్తించినప్పటికీ అధికారులకే ఈ విషయంలో క్లారిటీ లేనట్టుంది అని చర్చించుకుంటున్నారు.






