- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆందోళన
by Sridhar Babu |
వైద్యం వికటించి వ్యక్తి చనిపోయాడని, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబీకులు ఆందోళనకి దిగిన ఘటన ముస్తాబాద్ లో చోటు చేసుకుంది.

X
దిశ, ముస్తాబాద్ : వైద్యం వికటించి వ్యక్తి చనిపోయాడని, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబీకులు ఆందోళనకి దిగిన ఘటన ముస్తాబాద్ లో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడెం గ్రామానికి చెందిన దున్నపోతుల మల్లయ్య (60) అనే వ్యక్తికి సోమవారం జ్వరం రాగా ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమించి ఆదివారం మల్లయ్య మృతి చెందడంతో మృతుడి కుటుంబీకులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతో సకాలంలో సరైన వైద్యం అందకనే మల్లయ్య చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడం తో పరిస్థితి సర్దు మణిగింది.
- Tags
- man died
Next Story






